ఇండియా: శ్రీలంకలో చైనా 99 ఏళ్లు లీజుకి తీసుకున్న ప్రాంతానికి దగ్గరలో భారత్ ఎయిర్ పోర్ట్‌ నిర్వహణ

  • చైనాను ఎదుర్కునేందుకు భార‌త్ వ్యూహాత్మ‌క అడుగు
  • శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హంబన్‌తోటలో చైనా పోర్టు
  • మట్టాలా ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్న భారత్
  • 40 ఏళ్ల పాటు ఆ ఎయిర్‌పోర్ట్‌ను లీజుకు తీసుకోవాలని నిర్ణయం

భార‌త్ పెట్టుబ‌డుల‌తో త‌మ దేశంలో విమానాశ్ర‌య నిర్వహణ జరపనున్నట్లు శ్రీలంక విమానయాన శాఖ మంత్రి నిమల్‌ సిరిపాల తెలిపారు. భార‌త్‌పై విద్వేషం చిమ్ముతోన్న చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్డు (ఓబీఓఆర్‌) నిర్మాణం జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. అలాగే, అందులో భాగంగా శ్రీలంక దక్షిణ ప్రాంతంలో చైనా పోర్టు నిర్మిస్తోంది. త‌మ వాణిజ్య‌, వ్యాపార అవ‌స‌రాల‌కు ఆ ప్రాంతాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది.

అయితే, ఆ ప్రాంతానికి సమీపంలోనే భార‌త్‌ పెట్టుబడి పెడుతోంది. చైనాను ఎదుర్కునేందుకే భార‌త్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. శ్రీలంక లీజుకు తీసుకున్న ఆ ప్రాంతం పేరు హంబన్‌తోట. దానికి ద‌గ్గ‌ర‌లోనే మట్టాలా ఎయిర్‌పోర్ట్‌ను భారత్ అభివృద్ధి చేయ‌నుంది. ఇందులో భాగంగా 293 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి, 40 ఏళ్ల పాటు ఆ ఎయిర్‌పోర్ట్‌ను భార‌త్‌ లీజుకు తీసుకోనుంది. ఆ ఎయిర్‌పోర్టును భార‌త్ స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్ద‌నుంది.

  • Loading...

More Telugu News