క్రికెట్: కాసేప‌ట్లో హైద‌రాబాద్ క్రికెట్ స్టేడియానికి వ‌చ్చేస్తున్నా: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌

  • ఈ రోజు ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20 మ్యాచ్‌
  • వస్తున్నానని చెప్పి స్పష్టతనిచ్చిన ఆమిర్ ఖాన్
  • ఎంతో ఆత్రుతగా ఉందని ట్వీట్

ఈ రోజు ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20 మ్యాచ్‌ను చూసేందుకు బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్‌ని ఇటీవ‌ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌ప్ప‌కుండా వ‌స్తారా? అని అభిమానులు కాస్త డౌట్ పెట్టుకున్నారు. కాగా, తాను మ్యాచ్ చూసేందుకు వ‌స్తున్నాన‌ని ఆమిర్ స్ప‌ష్టం చేశారు.

కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యంపై ట్వీట్ చేసిన ఆమిర్... హైద‌రాబాద్ ఉప్ప‌ల్‌ స్టేడియానికి బ‌య‌లుదేరాన‌ని తెలిపారు. ఫ‌లితాన్ని తేల్చ‌నున్న‌ చివ‌రి మ్యాచును గ్రేట్ గేమ్‌గా అభివ‌ర్ణించారు. ఈ మ్యాచ్ చూడాల‌ని ఎంతో ఆత్రుత‌గా ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ మ్యాచ్ కి వర్షం భయం పట్టుకుంది. ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పటి వరకు వర్షం కురవకపోయినా రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో కురిస్తే పరిస్థితి ఏంటని అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది. 

  • Loading...

More Telugu News