prabhas: ప్రభాస్, రానా, ప్రభుతో చాలా డేంజర్ అంటున్న మెకాఫే
- సెర్చ్ ఇంజిన్ లో ప్రభు, ప్రభాస్, రానా, కపిల్ శర్మ, సల్మాన్, ఆమిర్, ప్రియాంకా చోప్రాల పేర్లు డేంజరస్
- వీరి పేర్లతో సెర్చ్ ఇంజిన్ లో వెతికితే డేంజరస్ సైట్లకు రీ డైరెక్ట్
- సైబర్ దాడి లేదా వైరస్ దాడి
దక్షిణాది స్టార్ నటులు ప్రభాస్, రానా, కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు పేర్లతో చాలా ప్రమాదమని ప్రపంచ స్థాయి సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే హెచ్చరిస్తోంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వీరి పేర్లతో ఆన్ లైన్ సెర్చ్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలని మెకాఫే సూచించింది. సెలబ్రిటీల పేర్లతో సెర్చ్ ఇంజన్ లో ఎంతవరకు సురక్షితం అన్నదానిపై ఏటా మెకాఫే అధ్యయనం చేసి ర్యాంకులు ఇస్తుంది. సెర్చ్ ఇంజిన్ లో ప్రమాదకరమైన నటుడిగా సీనియర్ నటుడు ప్రభు నెంబర్ వన్ గా నిలిచాడని మెకాఫే తెలిపింది.
ఆ తరువాతి స్థానంలో ప్రభాస్ నిలవగా, రానా దగ్గుబాటి మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి పేర్లను సెర్చ్ ఇంజిన్ లో వెతికినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో సైబర్ దాడి జరిగే అవకాశంతో పాటు వైరస్ చొరబడే ప్రమాదం ఉందని మెకాఫే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా చేసిన సెర్చ్ లో హిందీ టీవీ కమేడియన్ కపిల్ శర్మ నెంబర్ వన్ గా నిలిచాడు. కపిల్ శర్మ పేరుతో సెర్చ్ ఇంజిన్ లో వెతికితే 9.58 శాతం హానికర వెబ్ సైట్స్ ఓపెన్ అవుతున్నాయని మెకాఫే వెల్లడించింది, అతని తరువాత సల్మాన్, ఆమిర్, 8.5 శాతంతో ప్రియాంకా చోప్రా ఉన్నారని మెకాఫే తెలిపింది.