kamal haasan: రజనీకాంత్ వ్యాఖ్యలకు విపులంగా సమాధానమిచ్చిన కమలహాసన్!

  • రాజకీయం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు
  • ప్రజలకు మేలు చేయడం కూడా గెలుపే
  • రజనీతో నా స్నేహం చాలా గొప్పది
  • రాజకీయాల్లో అంబేద్కర్ మాత్రమే గొప్పవారు

వచ్చే నెల కొత్త పార్టీని స్థాపించే యోచనలో విలక్షణ నటుడు కమలహాసన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ, శివాజీ గణేశన్ కూడా పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారని అన్నారు. డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేమని, దానికి మించి ఉండాలని, ఈ విషయం కమల్ కు కూడా తెలుసని చెప్పారు.

తాజాగా, రజనీ వ్యాఖ్యలపై ఓ ఆర్టికల్ ద్వారా కమల్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపు మాత్రమే ముఖ్యం కాదని అన్నారు. రజనీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలనుకుంటే, నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెప్పవచ్చు కదా? అని కొందరు తనను అడగవచ్చని... తమ మధ్య ఉన్న స్నేహానికి అలాంటి క్లారిటీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ స్నేహం చాలా గొప్పదని, ఇది చాలా మందికి అర్థం కాదని అన్నారు. రాజకీయాల్లో గెలవడమంటే... అభ్యర్థులను ఎంపిక చేసి, మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి అయిపోవడమేనా? అని ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మంచి చేయడం కూడా గెలుపేనని చెప్పారు. రాజకీయ చరిత్రలో మనం గుర్తుంచుకోవాల్సింది కేవలం అంబేద్కర్ ను మాత్రమేనని అన్నారు.

kamal haasan
rajnikanth
tamil politics
  • Loading...

More Telugu News