అమెరికా: మరో సంచలనం.. యునెస్కో నుంచి వైదొలిగిన అమెరికా
- ‘యాంటీ ఇజ్రాయెల్’ విధానాన్ని అవలంబిస్తోందని అమెరికా వాదన
- అమెరికా నుంచి అధికారిక ప్రకటన
- ఈ ఏడాది 31 నుంచి అమల్లోకి తాజా నిర్ణయం
అమెరికా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైన్‌టిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు 'పారిస్ ఒప్పందం' నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
కాగా, యునెస్కో యాంటీ ఇజ్రాయెల్ విధానంతో ఉందంటూ అమెరికా చాలా కాలం నుంచి ఆరోపిస్తోంది. ఈ విషయంపై యూనెస్కో తమ పాలసీకి సానుకూలంగా లేని కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అమెరికా తెలిపింది.