జైరా వసీమ్: సినిమాలు చూడడం ఇష్టం వుండదు... ‘దంగల్’ నటి జైరా వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు
- సినిమాలు చూడటమంటే నాకు ఇష్టముండదు
- ‘దంగల్’ తప్పా అమీర్ ఖాన్ సినిమాలేవీ నేను చూడలేదు
- ఓ ఇంటర్వ్యూలో జైరా వసీమ్
‘దంగల్’ సినిమా కాకుండా ఇంతవరకూ అమీర్ ఖాన్ సినిమాలు ఏవీ తాను చూడలేదంటూ నటి జైరా వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్ పాత్ర పోషించిన జైరా వసీమ్.. ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదని చెప్పింది. అసలు, తనకు సినిమాలు చూడటమంటేనే ఇష్టముండదని తెలిపింది. సినిమా చూసేందుకు ఒకవేళ థియేటర్ కు వెళ్లినా.. సినిమా పూర్తయ్యే వరకు ఉండలేనని చెప్పింది. తాను చివరిసారిగా చూసిన సినిమా ‘దంగల్’ అని పేర్కొంది. ఈ సినిమా ద్వారా తనకు ఎంతో స్టార్ డమ్ వచ్చినప్పటికీ సాధారణ జీవితమే గడుపుతున్నానని చెప్పింది. సక్సెస్ కు నిర్వచనమంటూ లేదని, సక్సెస్ ను నెత్తినెక్కించుకున్న మరుక్షణమే పతనమవుతామని జైరా చెప్పుకొచ్చింది.