పాక్ కాల్పులు: పాక్ రేంజర్ల కాల్పుల్లో జవాను, పౌరుడి మృతి

  • బుద్ధిని మార్చుకోని పాక్
  • మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
  • జ‌మ్ముక‌శ్మీర్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో కాల్పులు

పాకిస్థాన్ త‌న బుద్ధిని మార్చుకోవ‌డం లేదు. భార‌త్ నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నప్ప‌టికీ పాకిస్థాన్‌ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు జ‌రుపుతూ అల‌జడి రేపుతోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం పాక్ రేంజ‌ర్లు మ‌రోసారి రెచ్చిపోయారు. మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో కాల్పుల‌కు తెగ‌బ‌డడంతో ఓ జ‌వాను, పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ రేంజ‌ర్ల కాల్పుల‌ను భార‌త సైన్యం తిప్పికొడుతోంది.        

  • Loading...

More Telugu News