ram gopal varma: సోమి టీచర్.. ఫీజు ఏ అడ్రస్ కు పంపాలి?: మంత్రి సోమిరెడ్డికి మరోసారి కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

  • నాతో చర్చకు రాలేనప్పుడు స్పందించాల్సిన అవసరం ఏముంది
  • ఎన్టీఆర్ గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసని ఒప్పుకున్నట్టేగా
  • సోమిరెడ్డి గారూ, గొప్ప పాఠం చెప్పారు

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. 'మినిస్టర్ సోమిరెడ్డి కామెంట్స్ కు నా రిప్లైస్' అంటూ ప్రారంభించిన వర్మ.... సోమిరెడ్డి చేసిన కామెంట్లను... దానికి అతని సమాధానాలను తెలిపాడు.

'ఎన్టీఆర్ తో బహిరంగచర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్లడు' అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులుగా... 'మీరు, మీ పాలేరు కూడా చర్చకు రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్నా ఎన్టీఆర్ గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరు ఒప్పుకున్నట్టేగా. థాంక్స్ సార్' అంటూ సమాధానమిచ్చాడు.

'వర్మా, తెలివితేటలు ఏమైనా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సక్సెస్ పై చూపించు' అన్న సోమిరెడ్డి కామెంట్ కు బదులుగా... 'వావ్. ఏం జీనియస్ సార్ మీరు. మీరు చెప్పేవరకు నాకు ఈ విషయమే తట్టలేదు. సోమి టీచర్ గారు, గొప్ప పాఠం చెప్పారు. ఫీజు ఏ అడ్రస్ కు పంపాలో చెప్పండి' అంటూ సెటైర్ వేశాడు. 

ram gopal varma
lakshmis ntr
tollywood
somireddy chandra mohan reddy
  • Loading...

More Telugu News