asteroid: నేడు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లనున్న గ్రహశకలం.. భూమికి ముప్పేమీ లేదు!
- అంటార్కిటికా సమీపం నుంచి వెళ్లనున్న గ్రహశకలం
- 2012లో దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
- దీని వ్యాసార్ధం 15 నుంచి 30 మీటర్లు
భూమికి పెను ప్రమాదం తప్పింది. భూమిని ఢీకొనే అవకాశం ఉన్న గ్రహశకలం తన దిశను మార్చుకుని... భూమికి అత్యంత సమీపంలో నుంచి వెళ్లనుంది. ఈ మధ్యాహ్నం ఇది అంటార్కిటికా సమీపం నుంచి భూమిని దాటుకుంటూ వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం పేరు 2012 టీసీ4. దీని వ్యాసార్ధం 15-30 మీటర్లు. ఇది ప్రయాణిస్తున్న దిశను బట్టి 2017లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని హవాయి దీవుల్లోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ 2012లో అంచనా వేసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు గ్రహశకల గమనాన్ని అనుక్షణం పరిశీలిస్తున్నారు. ఇది క్రమంగా తన దిశను మార్చుకుందని, భూమికి 42 వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుందని వారు ప్రకటించారు.