reliance jio: కొత్త అస్త్రాన్ని బయటకు తీసిన రిలయన్స్ జియో... రూ. 399 రీచార్జ్ చేస్తే 100 శాతం క్యాష్ బ్యాక్

  • మరో ధరల యుద్ధానికి శ్రీకారం
  • రూ. 399 రీచార్జ్ చేసుకుంటే రూ. 50 విలువైన 8 ఓచర్లు
  • దీపావళి వరకూ అందుబాటులో ఆఫర్

రిలయన్స్ జియో ప్రకటించిన రూ. 1500 ఫీచర్ ఫోన్ కు పోటీగా ఎయిర్ టెల్ కొత్త స్మార్ట్ ఫోన్ ను చౌక ధరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించిన వేళ, జియో తన అమ్ములపొదిలోని మరో అస్త్రాన్ని బయటకు తీసింది. టెలికం రంగంలో మరో ధరల యుద్ధాన్ని మొదలు పెడుతూ, రూ. 399 రీచార్జ్ పై 100 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తామని తెలిపింది.

 'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్ లో భాగంగా దీనిని అందుకోవచ్చని తెలిపింది. మూడు నెలల పాటు చెల్లుబాటయ్యే రూ. 399 రీచార్జ్ తో రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని, వీటిని నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని, ఈ ఆఫర్ నేటి నుంచి దీపావళి వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా, ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకున్న తరువాత, అత్యధికంగా లాభపడిన సంస్థగా రిలయన్స్ జియో నిలిచిన సంగతి తెలిసిందే.

reliance jio
jio dhan dhana dhan
cash back
  • Loading...

More Telugu News