fire c: సుప్రీం నిషేధం నేపథ్యంలో వ్యాపారం సాగేందుకు టపాకాయల దుకాణదారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది!

  • ఆన్ లైన్లో వ్యాపారం
  • వాట్స్ యాప్ చేస్తే ఇంటికి టపాకాయలు
  • నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ
  • టపాకాయల స్థానంలో చైనా లైట్లు, ల్యాంపులు

దేశ రాజధాని న్యూఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో దీపావళి టపాసుల అమ్మకాలను సుప్రీంకోర్టు నిషేధించగా, ఇప్పటికే సరుకును తెచ్చి పెట్టుకున్న వ్యాపారులు, తమ వ్యాపారం సాగించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తమ వద్ద ఉన్న ఫైర్ క్రాకర్లను రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. 10 వేలు ప్యాక్ లుగా విభజించి, ఆన్ లైన్లో ఆర్డర్లు తీసుకుంటూ ఇంటి వద్దకే తీసుకెళ్లి డెలివరీ చేస్తున్నారు. కస్టమర్లు వాట్స్ యాప్ లో ఆర్డర్ చేసి, ఆడ్వాన్స్ గా 50 శాతం చెల్లిస్తే చాలని, దీపావళికి ఒక రోజు ముందుగానే తాము డెలివరీ అందిస్తామని చెబుతున్నారు. ఇక అమ్మకాలను అనుమతించాలని కోరుతూ దుకాణదారుల సంఘం తరపున సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో తుది తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని టపాసుల వ్యాపారులు భావిస్తున్నారు.

కాగా, దీపావళి సామాన్లు ఎక్కువగా అమ్మే సదర్ బజార్ మార్కెట్లో ఇప్పుడు చైనా లైట్లు, ల్యాంపులు అధికంగా కనిపిస్తున్నాయి. ఫైర్ క్రాకర్స్ అమ్మడం లేదని, కేవలం ఆన్ లైన్లో మాత్రమే వాటిని విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సీజన్ లో టపాకాయల అమ్మకాల కోసం 400 మందికి అనుమతులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు, కోర్టు ఉత్తర్వుల మేరకు వాటిని రద్దు చేశారు. రెండు నెలల క్రితమే తమకు లైసెన్స్ లు మంజూరు చేయగా, కోట్ల రూపాయల విలువైన సరుకు తెచ్చి పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని అమ్మడానికి వీల్లేదంటే నష్టాలు భరించడం ఎలాగని వీరు వేసిన పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News