rahul gandhi: గుజరాతీ తెలియక లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్ గాంధీ... ఫోటో చూడండి!

  • గుజరాత్ లో ఉద్ధృతంగా సాగుతున్న రాహుల్ ప్రచారం
  • యువతతో ముచ్చటించేందుకు 'సంవాద్'
  • పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్
  • చదవడం రాకనే వెళ్లారన్న కాంగ్రెస్

గుజరాతీ చదవడం రాని రాహుల్ గాంధీ, పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన లోపలికి వెళుతున్న దృశ్యాలు, బయట బ్లాక్ క్యాట్ కమాండోల కాపలా చిత్రాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. యువతతో ముచ్చటించేందుకు 'సంవాద్' పేరిట సదస్సును నిర్వహించిన ఆయన, అక్కడి నుంచి బయటకు వస్తూ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లారు.

అక్కడ ఉన్న టాయిలెట్ పురుషులదా? లేక స్త్రీలదా? అన్న సంకేత బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో 'మహిళల మరుగుదొడ్డి' అని మాత్రమే అక్కడ ఓ పేపర్ పై రాసుంది. అది చదవడం తెలియకనే రాహుల్ ఆ టాయిలెట్ లోకి వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన వెంటనే దాన్ని కవర్ చేసేందుకు మీడియా అత్యుత్సాహం చూపగా, ఎన్ఎస్జీ సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటికే కొందరు తమ కెమెరాల్లో ఈ దృశ్యాలను బంధించారు. రాహుల్ బయటకు రాగానే, స్థానికుల నుంచి ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి.

rahul gandhi
gujarat
udaipur
  • Loading...

More Telugu News