Trisha: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • డాక్టర్ వేషంలో రానున్న త్రిష 
  • 'కేరాఫ్ సూర్య' షూటింగ్ పూర్తి 
  • 'ఆటగాళ్లు' తమ ఆట మొదలెట్టారు
  • వెంకటేశ్ తో తేజ సినిమా

*  సినిమాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ వన్నె తరగని అందంతో ఇంకా రాణిస్తోంది చెన్నయ్ బ్యూటీ త్రిష. కమర్షియల్ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలో 'పరమపథం' అనే కథానాయిక ప్రధాన చిత్రం చేస్తోంది. ఇందులో డాక్టర్ పాత్రలో త్రిష కనిపిస్తుందట.
*  సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'కేరాఫ్ సూర్య' చిత్రం షూటింగ్ నిన్నటితో పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తామని దర్శకుడు సుశీంద్రన్ తెలిపారు. వచ్చే నెల రెండో వారంలో రిలీజయ్యే ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించింది.
*  నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఆటగాళ్లు' చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.
*  బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ కి ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అలాగే, వెంకటేశ్ హీరోగా కూడా ఆయన ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం.      

  • Error fetching data: Network response was not ok

More Telugu News