జేసన్: ఆసీస్ బౌలర్ జేసన్ ను రెజ్లర్ తో పోల్చిన జర్నలిస్టు.. పగలబడి నవ్విన బౌలర్!

  • ఓ ప్రొఫెషనల్ రెజ్లర్ తో జేసన్ కు పోలికలు ఉన్నాయన్న విలేకరి
  • లేవన్న జేసన్
  • అంతటి వాడినయ్యేందుకు శ్రమిస్తానంటూ నవ్వు

గువాహటి వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ జేసన్ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మన దేశానికి చెందిన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జేసన్ పగలబడి నవ్వాడు. ‘మీకు, ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా కు పోలికలు ఉన్నాయని కొందరు అభిమానులు భావిస్తున్నారు’ అని ఆ విలేకరి ప్రశ్నించడంతో, జేసన్ కడుపుబ్బ నవ్వాడు. ‘ఈ విషయం మీరు వినలేదా?' అని ఆ విలేకరి అనడంతో, ‘లేదు.. వినలేదు. అతను నా కంటే పెద్దవాడు, అంతటివాడిని అయ్యేందుకు శ్రమిస్తా’ అంటూ జేసన్ మళ్లీ నవ్వులు చిందించాడు.

  • Loading...

More Telugu News