‘ట్విట్టర్’: ‘ట్విట్టర్’ ఖాతాలో ఇకపై సమంత పేరు ఇలా!

  • ఇన్నాళ్లూ ‘సమంత రూత్ ప్రభు’ పేరిట ఖాతా
  • ‘సమంత అక్కినేని’గా మార్పు
  • ఈరోజే ఎడిట్ చేసిన సమంత

టాలీవుడ్ జంట నాగచైతన్య-సమంత వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం, సోషల్ మీడియాలో తన పేరును సమంత మార్చుకుంది. ‘ట్విట్టర్’ ఖాతాలో ‘సమంత రూత్ ప్రభు’ పేరిట ఆమె అకౌంట్ ఇన్నాళ్లూ వుంది. ఆ పేరును ‘సమంత అక్కినేని’గా ఈరోజు నుంచి మార్చుకుంది. ‘ఫేస్ బుక్’, ‘ఇన్ స్టాగ్రామ్’ ఖాతాల్లో మాత్రం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ గానే ఉంది.  

  • Loading...

More Telugu News