director teja: బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ పై దర్శకుడు తేజ ప్రకటన!

  • ఎన్టీఆర్ బయోపిక్ పై తొలిసారి స్పందించిన తేజ
  • జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పిన దర్శకుడు
  • ఎన్టీఆర్ కథతో ఒకేసారి తెరకెక్కుతున్న రెండు సినిమాలు

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలని భావిస్తున్న నందమూరి బాలకృష్ణ... సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను ప్రముఖ దర్శకుడు తేజకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తేజ స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్ ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

మరోవైపు దర్శకుడు వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాను నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు, టీడీపీ నేతలకు మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరుగుతోంది. ఎన్టీఆర్ కు సంబంధించి ఒకే సమయంలో రెండు సినిమాలు తెరకెక్కనుండటంతో... ప్రేక్షకులు ఈ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

  • Loading...

More Telugu News