geetamadhuri: నందూపై నాకు పూర్తి నమ్మకం వుంది : గీతామాధురి
- గాయనిగా గీతామాధురి బిజీ
- నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో నందూ
- పరిణతి చెందిన ఆలోచనలు
- అపోహలకు .. అనుమానాలకు తావులేదు
అందమైన కోకిలలాగా గీతామాధురికి పేరుంది. కొన్ని పాటలను తాను మాత్రమే పాడగలను అనే విషయాన్ని ఆమె కెరియర్ తొలినాళ్లలోనే నిరూపించుకుంది. అలాంటి గీతామాధురికి నందూతో వివాహమైన సంగతి తెలిసిందే. నటుడిగా నిలదొక్కుకోవడానికి నందూ ప్రయత్నిస్తున్నాడు. సినిమా నేపథ్యం కావడం వలన సహజంగానే స్నేహాలు .. పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ జాబితాలో అమ్మాయిలు కూడా వుంటారు.
అందువలన నందూ విషయంలో ఎప్పుడైనా అభద్రతా భావం కలిగిందా? అనే ప్రశ్న .. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతామాధురికి ఎదురైంది. దాంతో ఆమె స్పందిస్తూ .. నందూపై తనకి ఎంతో ప్రేమ ఉందని చెప్పింది. ఆయన విషయంలో అభద్రతా భావం ఎప్పుడూ కలగలేదని అంది. అసలు ఆ ఆలోచనే తనకి రాలేదనీ .. అంతగా తనకి ఆయనపై నమ్మకం ఉందని చెప్పింది. ఇద్దరి ఆలోచనల్లో పరిణతి ఉందనీ, అందువలన అపోహలు .. అనుమానాలకు తావుండదని స్పష్టం చేసింది.