kathi mahesh: సినిమాలపై రివ్యూల కంటే మౌత్ టాక్ ప్రభావం ఎక్కువ : కత్తి మహేశ్

  • బాగున్న సినిమాలకి మంచి రేటింగ్స్ వస్తాయి
  • 'పెళ్లి చూపులు' .. 'మహానుభావుడు' అందుకు నిదర్శనం
  • కొన్ని సినిమాలకి రివ్యూలతో పని ఉండదు
  •  'బిచ్చగాడు' హిట్ అందుకు ఉదాహరణ            

ఏదైనా సినిమాను ముందుగానే చూసేసి రివ్యూలు చెప్పడం వలన, ఆ సినిమాకి వెళ్లాలనుకునేవారు వెనక్కి తగ్గుతారనీ, ఫలితంగా నిర్మాతలు నష్టపోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్తి మహేశ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో అయన తనదైన శైలిలో స్పందించారు. కేవలం రివ్యూలు చూసో .. వినో సినిమాలకి వెళ్లాలనుకునేవారు .. మానుకోవాలనుకునేవారు ఎవరూ ఉండరని ఆయన అన్నారు.

సినిమాలపై రివ్యూలు చూపే ప్రభావం 10 శాతం కన్నా ఎక్కువగా ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి సినిమాలకి మంచి రేటింగ్స్ వస్తాయనడానికి 'పెళ్లి చూపులు' .. 'మహానుభావుడు' వంటి సినిమాలే నిదర్శనమని అన్నారు. ఇక సినిమాలపై రివ్యూల కంటే మౌత్ టాక్ చూపే ప్రభావమే ఎక్కువనీ .. అందుకు 'బిచ్చగాడు' మూవీ ఉదాహరణ అని చెప్పారు. చాలామంది స్నేహితులను అడిగి తెలుసుకుని .. వాళ్లు చెప్పేదానిని బట్టే సినిమాలకి వెళ్లడం జరుగుతూ ఉంటుందని స్పష్టం చేశారు.     

  • Loading...

More Telugu News