cogress: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు చేదు అనుభవం

  • కలెక్టరేట్ శంకుస్థాపనకు హాజరైన సంపత్
  • శిలాఫలకంపై కనిపించని పేరు
  • అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు జరిగిన గద్వాల కలెక్టరేట్ శంకుస్థాపన కార్యక్రమానికి సంపత్ కుమార్ విచ్చేశారు. అయితే, శిలాఫలకంపై ఆయన పేరు కనిపించకపోవడంతో ఆయన షాకయ్యారు. శిలాఫలకాలపై ప్రొటోకాల్ ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా ప్రజాప్రతినిధుల పేర్లను రాయాల్సి ఉంటుంది. అయితే అధికారులు చేసిన తప్పిదం వల్ల సంపత్ కుమార్ అలిగి వెళ్లిపోయేంత పరిస్థితి తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. 

cogress
cogress mla sampath kumar
jogulamba gadwal
  • Loading...

More Telugu News