వరంగల్: వరంగల్‌లో బైకుపై హీరో నాని.. ‘ఎంసీఏ’ సినిమా వర్కింగ్ స్టిల్స్!
- హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకెళుతోన్న నాని
- ప్రస్తుతం ఎంసీఏ సినిమా షూటింగ్‌లో బిజీ
- నాని సరసన ‘ఫిదా’ నాయిక సాయి పల్లవి
- వరంగల్ లో షూటింగ్
హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకెళుతోన్న యువ నటుడు, నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఎంసీఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌లో అధిక భాగం ఇప్పటికే పూర్తైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘ఫిదా’ నాయిక సాయి పల్లవి.. నాని సరసన నటిస్తోంది.
శ‌్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను ఎంసీఏ చిత్ర ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వరంగల్‌లో జరుగుతోందని చెప్పారు. బైక్‌పై కూర్చున్న నాని ఫొటోలు అలరిస్తున్నాయి.