twitter: కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్న ట్విట్టర్
- ట్వీట్లు బుక్‌మార్క్ చేసుకునే అవకాశం
- త్వరలో అందుబాటులోకి `సేవ్ ఫర్ లేటర్` బటన్
- వెల్లడించిన సంస్థ ప్రోడక్ట్ మేనేజర్
ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్లు ఆకట్టుకునేలాగ ఉంటాయి. వాటిని భద్రపరుచుకునే సదుపాయం ట్విట్టర్‌లో లేదు. దీంతో స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఇష్టమైన ట్వీట్‌ని బుక్‌మార్క్ చేసుకుని తర్వాత చూసుకునే సదుపాయాన్ని ట్విట్టర్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఇటీవల జరిగిన `ట్విట్టర్ హ్యాక్ వీక్`లో ఈ సమస్యను కొంతమంది వినియోగదారులు ప్రస్తావించారట. దీంతో `సేవ్ ఫర్ లేటర్` బటన్‌ను ప్రవేశపెట్టాలని ట్విట్టర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇష్టమైన ట్వీట్లన్నింటిని ఒకే చోట చూసుకునేందుకు `సేవ్ ఫర్ లేటర్` అనే సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ జేసర్ షా తెలిపారు.