amitabh bachachan: ఇవాళ అమితాబ్ పుట్టిన రోజు... విషెస్ చెప్పిన ప్రధాని
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-46ed79cb6c8b4e5e8e5a9ebf94899ee6e89f4a29.jpg)
- 75వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ మెగాస్టార్
- శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
- విషెస్ తెలిపిన క్రికెటర్లు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇవాళ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. అమితాబ్‌కి విషెస్ చెబుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. సామాజిక కార్యక్రమాలకు దన్నుగా నిలిచే సినిమా దిగ్గజం అమితాబ్ దేశానికి గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు.
అలాగే అమితాబ్‌కు పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. వీరిలో ఫరాఖాన్, రణ్‌వీర్ సింగ్, మనీష్ పాల్, మిఖా సింగ్, నేహా ధూపియా, అర్జున్ బిజిలానీ, సునీల్ గ్రోవర్, జాన్ అబ్రహం, మోహన్ లాల్ ఉన్నారు. అలాగే క్రికెటర్లు సెహ్వాగ్, కైఫ్‌లతో పాటు రచయిత చేతన్ భగత్ కూడా అమితాబ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-b58cdec4638acc63a782a6b78eebe6e1ed2caee8.jpg)