emirates: ల్యాండ్ అవుతూ ఊగిపోయిన అతి పెద్ద విమానం... వీడియో చూడండి!

  • ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరొందిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ ఏ380
  • ల్యాండ్ అవుతున్న సమయంలో విమానాన్ని చుట్టుముట్టిన భీకరగాలులు
  • ల్యాండ్ అవుతూ వూగిపోయిన విమానం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరొందిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ ఏ380 విమానం ల్యాండ్ అవుతూ పూనకం పట్టినట్టు ఊగిపోయి, అందులోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాని వివరాల్లోకి వెళ్తే.... జర్మనీలోని డ్యూసెల్‌ డార్ఫ్‌ ఎయిర్ పోర్టులో ల్యాండ్‌ అవుతున్న సమయంలో భీకరమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో గాల్లో ఉన్నంత సేపు స్థిరంగా ఉన్న విమానం రన్ వేపై ల్యాండ్ అవుతూనే ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లోకి లేచింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. తర్వాత ల్యాండ్ అయిన కాసేపటి వరకు విమానం ఊగిపోతూనే ఉండడం విశేషం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీనిని కోటి మందికిపైగా చూడడం విశేషం.

emirates
airbus
a380
landing
  • Error fetching data: Network response was not ok

More Telugu News