pakistan: భారత్‌పై అణుబాంబులు ఎక్కుపెడుతున్న పాక్‌..!

  • భారత్ కు సమీపంలో సొరంగాల నిర్మాణం
  • సొరంగాల్లో అణ్వాయుధాలను రెడీగా ఉంచనున్న పాక్
  • ఈ ప్రదేశానికి అత్యంత సమీపంలోనే ఢిల్లీ

భారత్ పై పాకిస్థాన్ అణ్వాయుధాలను ఎక్కుపెడుతోందని రిపోర్టులు వస్తున్నాయి. పాక్ వద్ద దాదాపు 140 అణు ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా. వీటన్నింటినీ ఓ రహస్య ప్రదేశంలో దాచేందుకు పాక్ యత్నిస్తోంది. దీనికోసం సొరంగాన్ని నిర్మిస్తోందని ఓ అంతర్జాతీయ వెబ్ సైట్ పేర్కొంది. పాక్ లోని మియన్ వాలీ పట్టణం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తోందని తెలిపింది.

ఈ సొరంగాలు 10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగి ఉంటాయి. ఇలాంటి సొరంగాలను మూడింటిని నిర్మిస్తోందని సదరు వెబ్ సైట్ తెలిపింది. ఈ సొరంగాలు ఉన్న ప్రదేశానికి మిస్సైల్ లాంచర్లను తీసుకెళ్లేందుకు వీలుగా భారీ రోడ్లను కూడా నిర్మిస్తోందని చెప్పింది. మియన్ వాలీ పట్టణం భారత్ కు సమీపంలో ఉంటుంది. అమృత్ సర్ కు 350 కిలోమీటర్లు, ఢిల్లీకి 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తక్కువ దూరంలోనే అణ్వాయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా... భారత్ పై దాడికి సన్నద్ధంగా ఉండాలనేదే పాక్ ఆలోచన. 

  • Loading...

More Telugu News