రెండో టీ20: రెండో టీ20లో ఆసీస్ విజయం!
- 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
- విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఆసీస్
- 1-1 స్కోర్ తో సమానంగా ఉన్న ఇరు జట్లు
- రెండు జట్లకు కీలకం కానున్న మూడో టీ20 మ్యాచ్
రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది. గువహటి వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన టీమిండియా 118 పరుగులు చేసింది. అనంతరం, 119 పరుగుల విజయలక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది.
15.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా జట్టు 122 పరుగులు చేసి ఈ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. కాగా, మూడు టీ20ల సిరీస్ లో ఇప్పటికి 1-1 స్కోర్ తో ఇరు దేశాల జట్లు సమానంగా ఉన్నాయి. దీంతో మూడో టీ20 మ్యాచ్ రెండు దేశాల జట్లకు కీలకంగా మారనుంది. ఈ నెల 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.