కంచ ఐలయ్య: కంచ ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం!

  • ‘హిందూ’ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణ
  • మల్కాజ్ గిరి కోర్టును ఆశ్రయించిన దళిత యువకుడు
  • అరెస్టు చేయాలని కోర్టు ఉత్తర్వులు

మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ ఛానెల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కంచ ఐలయ్య మాట్లాడారని ఆరోపిస్తూ తిరుమలనగర్ కు చెందిన కె.నాగరాజ్ అనే దళిత యువకుడు కోర్టును ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాదనలు విన్న కోర్టు ఆయనపై సెక్షన్ 153 ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని, వచ్చే నెల 10వ తేదీలోగా ఓ నివేదిక సమర్పించాలని మల్కాజ్ గిరి పోలీసులను ఆదేశించింది.

 కాగా, ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News