అమీర్ ఖాన్: మాజీ భార్య పుట్టినరోజు వేడుకల్లో అమీర్ ఖాన్.. ఇదిగో వీడియో!

  • ముంబైలోని రీనా నివాసంలో వేడుక
  • ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసిన అమీర్ ఖాన్
  • షాంపెన్ బాటిల్ తో అమీర్ సందడి

బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ తన మాజీ భార్య రీనా దత్తా 50వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అమీర్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ముంబైలోని రీనా నివాసంలో నిన్న ఈ వేడుకలు జరిగాయి. రీనా కేక్ కట్ చేస్తుండగా, షాంపెన్ బాటిల్ పట్టుకున్న అమీర్ ఖాన్ ఈ వీడియోలో కనబడతాడు.

కాగా, 1986లో అమీర్-రీనా వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా వీరు 2002లో విడిపోయారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఉన్నారు. వీరు విడిపోయినప్పటికీ, ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News