మహేశ్ బాబు: మహేశ్ బాబు నవ్వితే ఆ పరమేశ్వరుడు కూడా ఐస్ అయిపోతాడు: పరుచూరి గోపాలకృష్ణ
- ‘పరుచూరి పలుకులు’ వీడియోలో మహేశ్ గురించి ప్రస్తావించిన గోపాలకృష్ణ
- చిరునవ్వుతో సామ్రాజ్యాలను జయించగల ధీశాలి అతను
- మహేశ్ చిరునవ్వు అద్భుతం
మహేశ్ బాబు నవ్వితే శివుడు కూడా ఐస్ అయిపోతాడని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ పేరిట విడుదలైన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు ఆయన విడుదల చేశారు.
‘ఈరోజు ఙ్ఞాపకాల్లో మహేశ్ బాబు తన్నకుంటూ వస్తున్నాడు. సడెన్ గా మహేశ్ బాబే ఎందుకు గుర్తొచ్చాడు!, ఇంకా చాలామంది ఉన్నారు కదా! అని అనిపిస్తుంది. మహేశ్ బాబు హీరో అయ్యాకే ప్రపంచానికి పరిచయం.కానీ, ఎనిమిది సంవత్సరాల వయసులోనే అతను మాకు పరిచయం.
మహేశ్ బాబు గురించి ఓ స్టేట్ మెంట్ ఇవ్వండీ అంటే, ‘మహేశ్ బాబు ఘట్టమనేని కృష్ణ గారికి గారాల పుత్రుడు..తెలుగు ప్రేక్షకులందరికీ వరాల పుత్రుడు’..ఇంతకుమించి ఇంకేమి చెప్పాలి అతని గురించి! మరో స్టేట్ మెంట్ ఇవ్వమంటే..‘చిరునవ్వుతో సామ్రాజ్యాలను జయించగల ధీశాలి’ అని నేను అంటాను. ‘ఇతని మీద ఎవరికైనా కోపం వస్తుందా’ అని నేను అనుకుంటూ ఉంటాను. మహేశ్ నవ్వితే... పరమేశ్వరుడంతటి వాడు కూడా ఐస్ అయిపోవాల్సిందే...అంత అద్భుతంగా ఉంటుంది అతని చిరునవ్వు!’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.