ఎంఎంటీసీ: ఎంఎంటీఎస్‌ రైలులో పాము.. ప్రయాణికులలో కలకలం!

  • లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళుతున్న రైలులో సంఘటన
  • అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది
  • పామును వెళ్లగొట్టేందుకు సిబ్బంది విఫలయత్నం

హైదరాబాదు, ఎంఎంటీఎస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళుతున్న రైలులోని ఓ బోగీలో పాము ఉండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్న తర్వాత, పామును వెళ్లగొట్టేందుకు అరగంట పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది విఫలయత్నం చేశారు. అప్పటికే, ఆలస్యం కావడంతో రైలును ఫలక్ నుమాకు పంపించారు. పాము ఉన్న బోగీలోని ప్రయాణికులను వేరే బోగీలోకి ఎక్కించినట్టు ప్రత్యక్షసాక్షుల కథనం.

  • Loading...

More Telugu News