rakul: క‌ళ్ల‌జోడు పెట్టుకుని నోరు తెర‌చి నిద్రపోతోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఫొటో పోస్ట్ చేసిన సాయిధరమ్ తేజ్!

  • అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న రకుల్
  • ఈ రోజు ఈ అమ్మడి పుట్టిన రోజు
  • రకుల్ ని ల‌కుల్ అని పేర్కొంటూ సాయిధరమ్ తేజ్ విషెస్

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ఆ త‌రువాత టాలీవుడ్‌లో సినిమా అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఈ ముద్దుగుమ్మ ఉంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆమెకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. యువ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ పొటో అల‌రిస్తోంది.

ఇందులో క‌ళ్ల‌జోడు పెట్టుకుని నోరు తెర‌చి ర‌కుల్ ప్రీత్ సింగ్ నిద్ర‌పోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమె ప‌క్క‌నే ఉన్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఆమెను స‌ర‌దాగా వేలెత్తి చూపిస్తున్నాడు. రకుల్ ని ల‌కుల్ అని పేర్కొంటూ హ్యాపీ బ‌ర్త్ డే చెప్పాడు.

  • Loading...

More Telugu News