amitab: టీవీ షోలో భావోద్వేగానికి గురైన అమితాబ్‌ బచ్చన్!

  • ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షోలో కన్నీరు పెట్టుకున్న అమితాబ్
  • ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌లోని షేర్‌వుడ్‌ కళాశాలలో విద్యనభ్యసించిన అమితాబ్ 
  • బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆ కళాశాల విద్యార్థులు 
  • బిగ్ బీ ఫేవ‌రెట్‌ గిటారిస్ట్‌ నీలాద్రి కుమార్ తో బర్త్‌డే ట్యూన్‌ వీడియో

దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షోలో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ షో నిర్వాహ‌కులు బిగ్‌బీకి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. అమితాబ్ బ‌చ్చ‌న్ చిన్న‌ప్పుడు చ‌దువుకున్న ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌లోని షేర్‌వుడ్‌ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయ‌న‌కు ప్రత్యేకంగా జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షోలో అమితాబ్‌కు చూపించారు.

దీంతో అమితాబ్ ఉద్వేగానికి లోనై క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోలో ఉపాధ్యాయులు, విద్యార్థులు క‌ళాశాల మొత్తం అమితాబ్‌కి చెందిన పోస్టర్లను అంటించారు. ఈ వీడియోలో బిగ్ బీ ఫేవ‌రెట్‌ గిటారిస్ట్‌ నీలాద్రి కుమార్ తో బర్త్‌డే ట్యూన్‌ను వినిపించారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తూనే ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News