regina: బాలకృష్ణ సినిమాకు 'నో' చెప్పిన రెజీనా, ప్రగ్యా జైస్వాల్!

  • షూటింగ్ దశలో బాలకృష్ణ 102వ మూవీ
  • 'రెడ్డిగారు' .. 'జయసింహా' టైటిల్స్ పరిశీలన
  • తాజాగా తెరపైకి 'కర్ణ' టైటిల్
  • కథానాయికగా నయనతార

బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఈ సినిమా కోసం 'రెడ్డిగారు' .. 'జయసింహా' టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా 'కర్ణ' టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నయనతార కీలకమైన పాత్రను పోషిస్తోంది.

 ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రెజీనాను సంప్రదించారట. అయితే ఆ పాత్ర చేయడానికి ఆమె ఆసక్తిని చూపలేదని అంటున్నారు. దాంతో అదే పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను కూడా అడిగారట. ఆమె కూడా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. పాత్ర నిడివి తక్కువగా ఉండటం .. అంతగా ప్రాధాన్యత కనిపించకపోవడం వల్లనే వాళ్లు ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని చెప్పుకుంటున్నారు. ఈ భామలిద్దరూ తమిళంలోను తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.      

  • Loading...

More Telugu News