pawan kalya: అప్పుడే పుట్టిన కుమారుడితో పవన్ కల్యాణ్.. ఆనందపరవశం... ఫొటో మీరూ చూడండి
- పవన్ కు పుత్రోత్సాహం
- బాబును అక్కున చేర్చుకున్న జనసేనాని
- ఆనంద పరవశంలో మునిగి తేలిన పవన్
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అతని భార్య లెజ్నోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా, అప్పుడే పుట్టిన తన కుమారుడిని చూసుకుని వపన్ మురిసిపోయారు. తన ఒళ్లో బాబును పడుకోబెట్టుకుని, తదేకంగా చూస్తూ, ఆనంద పరవశం చెందారు. ఆసుపత్రిలో జూనియర్ తో పవన్ కల్యాణ్ దిగిన ఈ ఫొటో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది.