Texas: మరోసారి పేలిన తూటా... టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం!

  • టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం
  • అనుమానాస్పద యువకుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు
  • కాల్పులు జరిపి పోలీసాఫీసర్ మృతికి కారణమైన యువకుడు

మాండలే బే రిసార్ట్ కాల్పుల కలకలం నుంచి అమెరికా ఇంకా తేరుకోకముందే టెక్సాస్ టెక్‌ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. లబ్ బాక్ లోని యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ దాచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు క్యాంపస్ కు వెళ్లి, తనిఖీలు నిర్వహించారు. ఇంతలో అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ యువకుడు కాల్పులు జరపగా, పోలీసాఫీసర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పరారైన నిందితుడు హోల్లిస్‌ డేనియల్స్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. క్యాంపస్ ను దిగ్బంధనం చేసిన పోలీసులు, క్షుణ్ణంగా పరిసరాలు గాలిస్తున్నారు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అక్కడ హెచ్చరికలు జారీ చేశారు.

Texas
Texas tech university
gun fire
police dead
  • Loading...

More Telugu News