‘జోష్’ రవి: హండ్రెడ్ పర్సెంట్ కృష్ణానగర్ కష్టాలన్నీ అనుభవించాను: ‘జోష్’ రవి

  • టీ లు తాగి గడపడం, ఫుడ్ లేకపోవడం.. కష్టాలు పడ్డా
  • సినీ ప్రయత్నాలు ప్రారంభించగానే దర్శకుడు తేజ వద్దకు వెళ్లా
  • ‘నీకు ఆఫర్ ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించారు
  • ఓ సీన్ చేసి చూపించాక నటించే అవకాశం ఇచ్చారు

కృష్ణానగర్ కష్టాలన్నీ తాను అనుభవించానని హాస్యనటుడు ‘జోష్’ రవి అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి రావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టగానే తనకు మొట్టమొదట గుర్తుకు వచ్చిన దర్శకుడు తేజ అని, ఆయన్ని కలిసి తనకో అవకాశం ఇవ్వాలని నాడు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

‘‘నీకు ఆఫర్ ఎందుకు ఇవ్వాలి?’ అని తేజగారు నన్ను ప్రశ్నించారు. ‘మీ దగ్గరకు వస్తే కచ్చితంగా నా లైఫ్ బాగుంటుందని నా నమ్మకం’ అని చెప్పాను. ఏదన్నా ఓ సీన్ చేసి చూపించమంటే చేసి చూపించాను. ‘తీసుకోండి అతన్ని’ అని తేజ గారు పక్కనున్న వాళ్లతో చెప్పారు. ‘ఒక విచిత్రం’ అనే సినిమా ద్వారా నేను పరిచయమయ్యాను. ఆ సినిమాకు దాసరి నారాయణరావు గారు ప్రొడ్యూసర్.... ఈ క్రమంలో టీలు తాగి గడపడం, ఫుడ్ లేకపోవడం..హండ్రెడ్ పర్సెంట్ కృష్ణానగర్ కష్టాలను నేనూ అనుభవించాను. ‘జోష్’ సినిమాలో నటించిన తర్వాత నాకు ఇమేజ్ వచ్చింది. ‘జబర్దస్త్’ లో నటించిన తర్వాత నాకు కష్టాలు లేవు’ అని రవి చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News