తాప్సీ పన్ను: బాక్సింగ్ చేస్తూ దుమ్ముదులిపేస్తోన్న హీరోయిన్ తాప్సీ.. వీడియో
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ
- ఓ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న ముద్దుగుమ్మ
- అభిమానులను అలరిస్తోన్న వీడియో
దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు తన అనుభవాలను వివరిస్తూ ఉంటుంది. ఆమెకు ట్విట్టర్‌లో 24,10,225 ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నిజంగానే దుమ్ముదులిపేస్తోంది. ‘దీని వద్దే ఉండండి.. ఎందుకంటే మీరు స్ట్రాంగ్, బ్యూటిఫుల్.. మరికొన్ని ఇటువంటి వాటి కోసం చూస్తూ ఉండండి’ అని తాప్సీ పేర్కొంది.
ఇందులో ఆమె మెరుపు వేగంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనపడుతోంది. ఓ సినిమా కోసం ఇలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాప్సీ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తాప్సీ ఎలా ఫైట్ చేస్తుందో మీరూ చూడండి..