కంచ ఐలయ్య: రక్షణ కల్పించమంటూ... డీజీపీ అనురాగ్ శర్మను కలిసిన కంచ ఐలయ్య!

  • నాకు నిరంతర రక్షణ కల్పించాలని కోరాను
  • సమస్యను ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం దృష్టికి తేవడం నా బాధ్యత
  • తన గొంతులో ప్రాణముండగా రాజకీయాల్లోకి రానన్న ఐలయ్య
  • సానుకూలంగా స్పందించిన డీజీపీ

ఆర్యవైశ్యుల నుంచి తన ప్రాణాలకు హాని ఉందంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై  డీజీపీ సానుకూలంగా స్పందించారని సమాచారం. కంచ ఐలయ్య ఎక్కడికైనా వెళితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.

అనంతరం, ఐలయ్య మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకూ పోలీసులు బాగా సహకరించారు. నాకు నిరంతర రక్షణ కల్పించాలని డీజీపీని కోరాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నవాడిని.. తెలంగాణ రాష్ట్రం వాడిని కనుక, సమస్యను నా ప్రభుత్వం దృష్టికి, పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సెప్టెంబర్ 5 నుండి నిన్నటి వరకు నాలుగు పెద్ద ఘటనలు జరిగాయి. ఆ పుస్తకం ఏంటో తెలియకుండా రోడ్ల మీద బడి ఒక మేధావి నాలుక కోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు.

ఏపీ అధికార పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి.. ఈ విషయం అమిత్ షాకు తెలియకుండా ఉండదు. అసలు, డీమోనిటైజేషనే చాలా పెద్ద సోషల్ స్మగ్లింగ్. దీనిపై చాలాసార్లు నేను వ్యాసాలు రాశాను’ అని చెప్పారు. ‘రాజకీయాల్లోకి వచ్చేందుకే కంచ ఐలయ్య ఇదంతా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి?’ అనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, ‘నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని, తెలంగాణ ఉద్యమ సయంలోనే వచ్చేవాడిని. నా గొంతులో ప్రాణముండగా రాజకీయ రంగంలోకి పోను. నాది సోషల్ రిఫార్మ్ అజెండా’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News