చంద్రబాబు పర్యటన: మూడు దేశాల పర్యటనకు చంద్రబాబు: పరకాల ప్రభాకర్
- అమెరికా, యూఏఈ, ఇంగ్లండ్‌లో పర్యటన
- 18 నుంచి 20 వరకు అమెరికాలో
- 21 నుంచి 23 వరకు యూఏఈలో
- 24 నుంచి 26 వరకు ఇంగ్లండ్‌లో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమెరికా, యూఏఈ, ఇంగ్లండ్‌లలో చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు ఆయా దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారని చెప్పారు.
అలాగే, అమరావతి పరిపాలన నగరం ఆకృతుల ఖరారు గురించి కూడా చంద్రబాబు చర్చిస్తారని పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు అమెరికాలో, 21 నుంచి 23 వరకు యూఏఈలో, 24 నుంచి 26 వరకు ఇంగ్లండ్‌లో చంద్రబాబు పర్యటన ఉంటుందని చెప్పారు.