కేటీఆర్: కేటీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కవిత

  • నియోజకవర్గానికి రూ.350 కోట్లు కేటాయింపుపై హర్షం
  • నిజామాబాద్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
  • భవిష్యత్తులో మరిన్ని ఐటీ పార్క్ లు
  • గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగం: ఎంపీ కవిత

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత ఈరోజు కలిశారు. తన నియోజకవర్గానికి రూ.350 కోట్లు కేటాయించినందుకు కేటీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో కవిత మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున, కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ. 350 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

నిజామాబాద్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని ఐటీ పార్క్ లను ఏర్పాటు చేస్తామని, ఐటీ కంపెనీల ఏర్పాటు తో గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కృషితో 60 ఐటీ కంపెనీలు ఈ ఐటీ హబ్‌లో ఏర్పాటు కానున్నాయని, వచ్చే దసరా నాటికి దీనిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఈ సందర్భంగా కవిత పేర్కొన్కారు.
 
కాగా, నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని టీఎస్ఐఐసీ కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని కవిత తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News