pavan: 'అజ్ఞాతవాసి' టైటిల్ పోస్టర్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

  •  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ మూవీ
  •  'అజ్ఞాతవాసి' టైటిల్ ను రిజిస్టర్ చేయించిన నిర్మాతలు
  •  దీపావళికి టైటిల్ పోస్టర్స్ రిలీజ్ అంటూ వార్తలు
  •  త్వరలో యూరప్ షెడ్యూల్ మొదలు

పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. హారిక హాసిని బ్యానర్ వారు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఇదే టైటిల్ ఖాయం కానుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వున్నారు. 'అజ్ఞాతవాసి' టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో, .. దీపావళికి టైటిల్ తో కూడిన పోస్టర్స్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

 ఈ నెల 19వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్  .. టైటిల్ పోస్టర్స్ పలకరించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 3వ వారం నుంచి 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు.    

  • Loading...

More Telugu News