salman khan: బిగ్ బాస్ రెమ్యూనరేషన్ 11 కోట్లు కాదట... అజయ్ దేవగణ్ కి చెప్పిన సల్మాన్... నవ్వేసిన రోహిత్ శెట్టి!

  • స్టంట్ చేయమన్న రోహిత్ శెట్టి
  • ఈ వయసులో లైవ్ స్టంటా? అన్న అజయ్ దేవగణ్
  • వాళ్లిచ్చే డబ్బులకి హోస్టింగ్ చాలులెండి! 

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ సీజన్-11' హోస్ట్ గా వ్యవహరించేందుకు 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సందర్భాల్లో ప్రశ్నించినా పెద్దగా స్పందించని సల్మాన్ ఖాన్ తాజాగా జరిగిన 'వీకెండ్ కీ వార్' ఎపిసోడ్ లో స్పందించాడు. ఈ ఎపిసోడ్ అతిథులుగా 'గోల్ మాల్' చిత్రబృందం వచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్ శెట్టి ఒక స్టంట్ చేయాలని సల్మాన్, అజయ్ దేవగణ్ లను కోరాడు. 'ఈ వయసులో లైవ్ స్టంట్ అడగడం సరికాద'ని రోహిత్ శెట్టికి అజయ్ దేవగణ్ సూచించాడు. దానికి సల్మాన్ 'వాళ్లిచ్చే రెమ్యూనరేషన్ కి యాంకరింగే సరిపోతుందని, స్టంట్స్ అంటే ఇంకా ఇవ్వాల్సి ఉంటుంద'ని అన్నాడు.

దీంతో అజయ్ కల్పించుకుని 'రెమ్యూనరేషన్ బాగానే ముడుతుందటకదా?' అన్నాడు. 'అవునవును... మీడియా చెబుతున్నంతగా హోస్ట్ కు ఇవ్వరు. కావాలంటే రోహిత్ శెట్టిని అడుగు' అంటూ.. 'ఏం రోహిత్! 'ఖత్రోంకీ ఖిలాడీ'కి నీకు ఎంతిచ్చారు?' అని అడిగాడు. సల్మాన్ మాటలతో రోహిత్ శెట్టి నవ్వుతూ 'నిజమే' అన్నాడు. 

salman khan
remuneration
bigg boss
ajay devgun
rohith shetty
  • Loading...

More Telugu News