niveda thomas: నాకెంతో నచ్చిన పాత్రలు అవి .. అలాంటివి చేయాలనుంది : నివేదా థామస్

  • నివేదా థామస్ కి వరుస అవకాశాలు
  • టాలీవుడ్ లో పెరుగుతోన్న క్రేజ్
  • ఛాలెంజింగ్ పాత్రలు చేయాలంటోన్న నివేదా
  • ఆ తరహా పాత్రల కోసం వెయిటింగ్

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో నివేదా థామస్ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. గ్లామర్ తో పాటు సహజమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ ఉండటంతో, అమ్మడిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. దానికి తోడు వరుస విజయాలు కూడా పలకరిస్తూ ఉండటంతో, ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అలాంటి వివేదా థామస్ .. ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతోంది.

 'తను వెడ్స్ మను' లో కంగనా రనౌత్ .. 'బర్ఫీ'లో ప్రియాంకా చోప్రా .. 'బాజీరావ్ మస్తానీ'లో దీపికా పదుకొనే చేసిన పాత్రలు అద్భుతమని అంటోంది. ఆ తరహా  పాత్రలు చేయాలని ఉందని చెబుతోంది. అలాంటి స్క్రిప్ట్స్ తో తన దగ్గరికి ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నానని అంటోంది. ఆమెకి ఆ తరహా పాత్రలు ఎప్పుడు వస్తాయా అనే విషయాన్ని అటుంచింతే, త్వరలో ఆమె సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ జోడీగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

niveda thomas
  • Loading...

More Telugu News