rai laxmi: మరోసారి ప్రేమలో పడిన 'రత్తాలు'.. బాలీవుడ్ లో రాయ్ లక్ష్మి ప్రేమాయణం!

  • 'ఖైదీ నంబర్‌ 150'లో 'రత్తాలు రత్తాలు' అంటూ మత్తెక్కించిన రాయ్ లక్ష్మి 
  • బాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ-2
  • మోడల్, నటుడు హనీఫ్ హీలాల్ తో ప్రేమాయణం?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'లో 'రత్తాలు రత్తాలు' అంటూ చిందులేసి తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కించిన లక్ష్మీ రాయ్ (రాయ్‌ లక్ష్మి) బాలీవుడ్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. సినీ నటిగా కంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాజీ ప్రేయసిగా ఆమె పేరు సంపాదించింది. అయితే, ధోనీతో ప్రేమ విఫలమైందని, అది గతించిన కథ అంటూ ఆమె పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, ఈ అమ్మడు తాజాగా మరో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని తెలుస్తోంది. ఈ మేరకు బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ–2 సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి బాలీవుడ్‌ లోనే మకాం పెట్టిన రాయ్‌ లక్ష్మి, మోడల్, నటుడు హనీఫ్‌ హీలాల్‌ అనే వ్యక్తితో లవ్‌ లో పడిపోయిందని, డేట్ పేరుతో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై ఆమె ఏమంటుందో మరి. 

  • Loading...

More Telugu News