అంబికా కృష్ణ: ఈ రోజుకీ నాకు ‘మందు’ అంటే తెలియదు: అంబికా కృష్ణ
- కనీసం వక్కపొడి కూడా వేసుకోను
- నేను ఏ హీరోయిన్ కు బ్లాంక్ చెక్ ఇవ్వలేదు
- సినీ ఇండస్ట్రీలో పాలిటిక్స్ లేవు
- ఓ ఇంటర్వ్యూలో అంబికా కృష్ణ
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని, తానన్నా ఆయనకు అంతే అభిమానమని ఏపీ ఫిల్మ్, థియేటర్, డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు ఎటువంటి అలవాట్లు లేవని, ఈ రోజుకీ ‘మందు’ అంటే తనకు తెలియదని, ఎన్నో పార్టీలకు వెళ్లినా దాని జోలికి తాను వెళ్లనని, కనీసం వక్కపొడి కూడా వేసుకునే అలవాటు తనకు లేదని చెప్పారు.
‘పురుష కార్యకర్తలకు నయా పైసా కూడా ఇవ్వరని, మహిళా కార్యకర్తలకు అయితే డబ్బులిస్తారనే విమర్శ మీపై ఉంది!’ అని ప్రశ్నించగా, అవన్నీ అబద్ధాలని అంబికా కృష్ణ కొట్టిపారేశారు. ‘ఓ హీరోయిన్ కు అయితే ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చారట కదా?’ అనే మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అవన్నీ ఒట్టి మాటలేనని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ లేవని, ఒకవేళ ఉన్నా, ఇండస్ట్రీని చెడగొట్టేంతగా లేవని అన్నారు.