దీపావళి: నా పుట్టినరోజు, ఈ దీపావళి జరుపుకోవట్లేదు : అమితాబ్
- ఈ నెల 11న అమితాబ్ బర్త్ డే
- ట్వీట్ చేసిన బిగ్ బీ
- అమితాబ్ కు 30 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లు
ఈ దీపావళి పండగ జరుపుకోనని బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతా ‘.. మీ సమాచారం కోసం .. ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకోవట్లేదు!!’ అని పోస్ట్ చేసిన అమితాబ్, ఓ అద్భుతమైన తన ఫొటోను పోస్ట్ చేశారు.
కాగా, బిగ్ బీని ట్విట్టర్ ఖాతా ద్వారా అనుసరించే వారి సంఖ్య 30 మిలియన్స్ కు చేరింది. ఈ సందర్భంగా అమితాబ్ ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ నెల 11న అమితాబ్ పుట్టినరోజు. అయితే, బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా జరుపుకోవడం లేదని మరో ట్వీట్ లో అమితాబ్ పేర్కొనడం గమనార్హం.