కేసీఆర్: కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు తగదు: మంత్రి తలసాని

  • మీడియా సమావేశంలో తలసాని
  • ప్రజా శ్రేయస్సే క్షేమంగా ప్రభుత్వం పని చేస్తోంది
  • టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలననడం కరెక్టు కాదు

సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సే క్షేమంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటం తగదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబపాలనని ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో అర్థం లేదని మండిపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిదేనని చెప్పారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని,  పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని, అన్ని కమ్యూనిటీలకు చెందిన పండగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని, గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, ప్రస్తుతం కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News