kancha ilaiah: ఓ వైపు వైశ్యులు, మరోవైపు ఐలయ్య మద్దతుదారులు... తార్నాకలో ఉద్రిక్తత!

  • ఐలయ్య ఇంటికి కదిలిన వైశ్య సంఘాల నేత శ్రీను
  • అప్పటికే చేరుకున్న ఐలయ్య మద్దతుదారులు
  • తార్నాక ఫ్లయ్ ఓవర్ వద్దే వైశ్యులను అడ్డుకున్నపోలీసులు

ముందుగా చెప్పినట్టుగానే వైశ్య సంఘాల నేత శ్రీను తార్నాకలోని ఐలయ్య ఇంటి సమీపానికి చేరుకున్నారు. అప్పటికే ఐలయ్య మద్దతుదారులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు, ఓ వర్గం వారిని మరో వర్గం వారితో కలవనిచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇక మరోపక్క, తన ఇంటికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జరిగే ఘటనలకు వైశ్యులదే బాధ్యతని ఐలయ్య చెప్పగా, ఆ తీవ్ర పరిణామాలు ఏంటో చూస్తామని వైశ్య సంఘాలు విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం వైశ్య నేతలు తార్నాక ఫ్లయ్ ఓవర్ వైపు నుంచి ఐలయ్య ఇంటి వైపు వెళుతుండగా, వారిని అక్కడే మకాం వేసిన పోలీసులు బారికేడ్లతో అడ్డుకుంటున్నారు.

kancha ilaiah
samajika smugglarlu komatollu
tarnaka
  • Loading...

More Telugu News