mahesh babu: 'స్పైడర్' కి తమిళంలోను నిరాశే ఎదురైంది!

  •  తెలుగులో పరాజయాన్ని చవిచూసిన 'స్పైడర్'
  •  తమిళంలో సక్సెస్ అవుతుందని భావించిన టీమ్
  •  అక్కడ కూడా వేగంగా తగ్గుతోన్న వసూళ్లు
  •  అభిమానుల్లో నిరాశ  

మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'స్పైడర్' .. తెలుగుతో పాటు తమిళంలోను విడుదలైంది. మహేశ్ బాబు తమిళంలో నేరుగా చేసిన మొదటి సినిమా ఇది. దాంతో తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా సక్సెస్ ను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

 అయితే తమిళంలో మహేశ్ స్టార్ ఇమేజ్ ను పక్కనపెట్టేసి అక్కడి ఆడియన్స్ ఈ సినిమా చూస్తారు గనుక, వాళ్లకి నచ్చుతుందని అనుకున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో, ఈ సినిమా వసూళ్లు పుంజుకుంటాయనే అంచనా వేశారు. అయితే అక్కడ కూడా వేగంగా ఈ సినిమా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. తమిళంలోనైనా ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందనుకున్న ఈ సినిమా టీమ్ కి .. అభిమానులకు నిరాశే ఎదురైంది.  

  • Loading...

More Telugu News