kancha ilaiah: కంచ ఐలయ్య ఇంటికి కదిలిన వైశ్యులు... భారీ భద్రత!

  • వైశ్యులతో చర్చించేది లేదని తేల్చి చెప్పిన ఐలయ్య
  • తామే వస్తున్నామని కదిలిన వైశ్య సంఘాలు
  • కలవనీయబోమని చెబుతున్న పోలీసులు

'సామాజిక స్మగ్లర్లు వైశ్యులు' అంటూ కంచ ఐలయ్య రాసిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపగా, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గడచిన నెలన్నర రోజులుగా డిమాండ్ చేస్తున్న వైశ్య సంఘాలు, నేడు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతామని స్పష్టం చేస్తూ, ఆయన ఇంటికి కొందరు వైశ్య ప్రతినిధులు బయలుదేరారు. తొలుత ఐలయ్యను చర్చకు వైశ్యులు ఆహ్వానించగా, తాను చర్చలకు రాబోనని, తన ఇంటికి ఎవరైనా చర్చలకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తాను రాసిన పుస్తకం సరైనదేనని ఆయన నిరూపించుకోవాలని కోరుతున్న వైశ్య సంఘాల నేతలు, ఐలయ్య ఇంటికి బయలుదేరగా, ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్యను, వైశ్యులను కలవనీయబోమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మీడియా కూడా ఐలయ్య ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంది. 

kancha ilaiah
samajika smugglarlu komatollu
  • Loading...

More Telugu News