Hostel: దొంగలకు ఈజీ టార్గెట్‌గా మారుతున్న హైదరాబాద్ హాస్టళ్లు!

  • గతంలో హాస్టళ్లలో ఉన్నవారే దొంగలుగా మారుతున్న వైనం
  • సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విలువైన వస్తువుల చోరీ
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌లోని హాస్టళ్లు, బ్యాచిలర్లు ఉండే రూములు దొంగలకు ఈజీ టార్గెట్‌గా మారుతున్నాయి. గతంలో ఆయా హాస్టళ్లలో ఉండే వారే దొంగలుగా మారి విలువైన వస్తువులు, మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలిస్తున్న ఘటనలు ఇటీవల పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి.

పెద్దపల్లికి చెందిన నిట్టూరి స్నేహిత్ రామ్ హాస్టల్‌లో దొంగతనం చేస్తూ  పోలీసులకు చిక్కాడు. ల్యాప్‌టాప్ టెక్నీషియన్‌గా పనిచేసే స్నేహిత్‌రామ్ నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చోరీలకు పాల్పడేవాడు. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు.
 
హాస్టల్‌లో ఉన్నప్పుడు తన రూమ్మేట్లు వారి సామన్లను భద్రపరిచి తాళం చెవిని తలుపు సందులు, షూ ర్యాకుల్లో పెట్టడం గమనించిన స్నేహిత్ దొంగతనాలు చాలా  సులభంగా చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఆ తాళం చెవులను తీసి విలువైన వస్తువులను దొంగిలించేవాడు. ఇప్పుడు ఇటువంటి దొంగతనాలు నగరంలో బాగా ఎక్కువైపోయినట్టు పోలీసులు తెలిపారు.

గతంలో వారు హాస్టళ్లు, రూముల్లో ఉండడం వల్ల సెక్యూరిటీ గార్డులు కూడా వారిని అనుమానించడం లేదని, దీనిని అవకాశంగా తీసుకుంటున్న వారు రెచ్చిపోతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాబట్టి హాస్టళ్లు, రూముల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  హాస్టల్ యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News